కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏకంగా సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మందికి పైగా కాంట్రాక్టర్లు హాజరయ్యారు. భట్టిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఎస్పీఎఫ్ ఆపండంతో కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బయట వడ్డీలకు అప్పులు తీసుకు వచ్చామని వాపోయారు. బిల్లులు కావాలంటే కనీసం 20 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.