ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీకి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై అధికారులు మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు చేశారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న ఇద్దరు, బాలికల జూనియర్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న ఒక విద్యార్థిపై కేసు నమోదు చేసినట్లు ఐపీఈ పరీక్షల నిర్వహణ జగిత్యాల జిల్లా కన్వీనర్ బి.నారాయణ తెలిపారు.