వివేకా హత్య కేసుపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్
NEWS Mar 07,2025 11:09 am
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు కడప జిల్లా ఎస్పీ జి. అశోక్ కుమార్. కీలకమైన సాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని అన్నారు. కటికరెడ్డి శ్రీనివాస రెడ్డి, కల్లూరి గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ Y.S అభిషేక్ రెడ్డి ఇప్పుడు రంగన్న ఇలా ప్రతి ఒక్కరు చిరునామా లేకుండా చావులకు లోనైనట్లు తెలిపారు. రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.