టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ
NEWS Mar 07,2025 10:58 am
మంత్రి నారాయణ సంచలన ప్రకటన చేశారు. విశాఖలో చోటు చేసుకున్న టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ , సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని చెప్పారు. నివేదిక ఇంకా రాలేదని, వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాసన సభ ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకవతకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఒక్క విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయన్నారు.