సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్
NEWS Mar 07,2025 08:33 am
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ములాఖత్ అవుతారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళతారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేల కోటా కింద నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.