నిజామాబాద్ మార్కెట్ కు పసుపు
NEWS Mar 07,2025 08:15 am
పసుపు పండించిన రైతులకు ధర గిట్టుబాటు అవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది. అతివృష్టి లేక పోవడంతో దుంపకుళ్లు తెగులు రాలేదు. దీంతో దిగుబడి సైతం గత ఏడాది కంటే ఎక్కువగా వస్తోంది. రాష్ట్రంలో పండించిన పసుపు పంటలో 80 శాతం నిజామాబాద్ మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటివరకు ఫింగర్ పసుపు రకానికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 13,311 ధర పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.11,300 ధర దక్కుతోంది.