పేకాట స్థావరంపై మెరుపు దాడి
NEWS Mar 07,2025 08:15 am
ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్‌ఐ సిహెచ్ గణేష్ తన సిబ్బందితో ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 13,340 రూపాయల నగదు, ఒక కారు, ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు,కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎస్ఐ సిహెచ్ గణేష్ తో పాటు కానిస్టేబుల్ కుమార్, సంతోష్, కాసిం, శ్రీనివాస్ లు ఉన్నారు.