ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. ఒకరి పై మాల్ ప్రాక్టీస్ కేసు
NEWS Mar 07,2025 04:17 pm
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం కాగా, 420 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 57 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 49 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు.