రైతులతో కలెక్టర్ ములాఖత్
NEWS Mar 06,2025 09:29 pm
మెట్ పల్లి మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. ఈ సందర్బంగా కలెక్టర్ ఘనంగా సన్మానించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్. యార్డ్ లో ఆరబోసిన పసుపు ధాన్యాన్ని పరిశీలించారు. పసుపులో పలు రకాల ధాన్యం గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారని, ఎక్కడికి రవాణా చేస్తున్నారని, కనీస మద్దతు ధర లభిస్తుందా అని రైతులను అడిగారు.