ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది వైసీపీ పాలనలోనేనని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. దృష్టి పెట్టక పోవడం వల్లనే దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తాము వచ్చాక ఉక్కుపాదం మోపామని చెప్పారు. ఇందుకు సంబంధించి నిఘా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వంలో 70 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. 3 గంజాయి కేసులలో ఇప్పటికే ఆస్తుల జప్తును అమలు చేశామన్నారు. డాక్టర్ ప్రిస్క్పిక్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మితే మెడికల్ షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.