ఆటో-బైక్ ను ఢీకొట్టిన బొలెరో వాహనం
NEWS Mar 06,2025 05:52 pm
ములుగు జిల్లా మంగపేట మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి ప్రధానర హదారిపై బొలెరో వాహనం ఆటో, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కాగా బైకు, ఆటోలో ఉన్న వ్యక్తులకు గాయాలైనట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.