శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
NEWS Mar 06,2025 05:54 pm
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రి చంద్రశేఖర్ కోహిర్ మండల పరిధిలోని బడంపేట గ్రామం లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , నిర్వాహకులు స్వాగతం పలికి తీర్థం , ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, మంత్రి మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల కృప నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు.