భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీపై సీరియస్ అయ్యారు మత పెద్దలు. తను రోజాను పాటించడం లేదంటూ మండిపడ్డారు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ. ఇస్లాం మతంలో రోజా అన్నది అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క పరుషుడు, స్త్రీకి వర్తిస్తుందన్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఉపవాసం చేయక పోతే అది పాపం అవుతుందని అన్నారు. షమీ రోజా పాటించక పోవడం దారుణమన్నారు.