ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 7949 మంది విద్యార్థులకు గాను 7789 మంది విద్యార్థులు హాజరు కాగా, 160 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. ఇందులో 7278 మంది విద్యార్థులు జనరల్ అభ్యర్థులకు గాను 7137 మంది పాల్గొనట్లు తెలిపారు.