సోషల్ వెల్ఫేర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్
NEWS Mar 06,2025 04:06 pm
డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. కళాశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్ లు, డార్మెటరీ, స్టోర్ రూం లను పరిశీలించారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్స్ లను పరిశీలించారు. ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి, నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.