కొడుకులు..కోడళ్లు పట్టించు కోవడం లేదు
NEWS Mar 06,2025 09:35 pm
కొడుకులు, కూతుళ్లు పట్టించు కోవడం లేదంటూ ఓ వృద్దురాలు వాపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట్ మండలం కోస్లీ ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల గుడ్డి ముత్తెమ్మ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చింది. తనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, తనను పట్టించు కోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తనకు వారి నుంచి సహాయం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను విన్నవించింది. ఆమెతో మాట్లాడి సముదాయించి పంపించారు. కొడుకులు, కూతుళ్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.