మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోడీకి సంకెళ్లు వేసిన ట్రంప్ ఉన్న కార్టూన్ కి చెందిన ఆనంద వికటన్ వెబ్ సైట్. దీనిపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిని సవాల్ చేస్తూ న్యూస్ పోర్టల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు గురువారం వెంటనే నిషేధాన్ని ఎత్తి వేయాలని ఆదేశించింది. అమెరికాలో ఉంటున్న విద్యార్థులకు సంకెళ్లు వేసినా ఎందుకు మోదీ మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ ఈ కార్టూన్ ను పబ్లిష్ చేసింది ఆనంద వికటన్. ఈ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది.