నిజామాబాద్ మార్కెట్ కు భారీగా పసుపు
NEWS Mar 06,2025 02:35 pm
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు రెండు రోజులుగా పసుపు పోటెత్తుతోంది. జిల్లా నుండే కాకుండా జగిత్యాల్, కోరుట్ల, నిర్మల్ ప్రాంతాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పసుపును యార్డులో అమ్ముకునేందుకు రైతులు పెద్ద యెత్తున తీసుకొచ్చారు. రెండు రోజుల్లో 39,684 క్వింటాళ్ల పసుపును రైతులు మార్కెట్ యార్డుకు తరలించారు. బుధవారం 27,576 క్వింటాళ్లు రాగా.. గురువారం 12,108 క్వింటాళ్ల పసుపును రైతులు యార్డుకు తేవడంతో యార్డులో ఎక్కడ చూసినా రాశులుగా పోసిన పసుపు దిగుబడులే దర్శనమిచ్చాయి.