సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై స్టే ఇచ్చింది హైకోర్టు. తొలుత ఫార్మా కంపెనీల కోసం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. తమ భూములను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. దీంతో సర్కార్ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఫార్మా కంపెనీల కోసం కాదని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేసింది. దీని పేరుతో భూసేకరణ మొదలు పెట్టింది. దీనిపై కోర్టు నిలుపుదల చేస్తూ తీర్పు చెప్పింది.