వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణ ముగిసింది. విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ లో విచారణ కు హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన గోరంట్ల కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ నాయకుడు జగన్ ను నిలువరించేందుకే తమను ఇబ్బందులకు ఉరి చేస్తున్నారని ఆరోపించారు. పలువరు పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలన్నారు. ఏపీలో ఎమెర్జెన్సీ రోజులు గుర్తు చేస్తున్నారని అన్నారు. తమ సర్కార్ హయాంలో ఇలా చేయలేదన్నారు.