ఖాళీ ఇండ్లను అర్హులకు కేటాయించాలి
NEWS Mar 06,2025 02:09 pm
కోరుట్ల: పట్టణంలోని అర్బన్ కాలనీ, యాసీన్ గుట్ట, మాదాపూర్ కాలనీ, అల్లామియా గుట్ట ప్రాంతాల్లో నిర్మించబడిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో అనేక గృహాలు ఇప్పటికీ ఖాళీగా ఉండటంతో, అర్హులైన నిరుపేదలకు వాటిని తక్షణమే కేటాయించాలని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ ఆర్డీఓ దివాకర్ రెడ్డి నీ కలిసి వినతిపత్రం సమర్పించారు.