తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నిమ్మల రామానాయుడు. కావాలని రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వృథాగా పోతున్న నీళ్లను వాడుకున్నామని, దీనిలో తప్పేముందంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే రాద్ధాంతాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తాము బరాబర్ నీళ్లను వాడుకుని తీరుతామంటూ స్పష్టం చేశారు. గోదావరి పై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం కట్టేందుకు ప్రయత్నం చేస్తే ఆనాడు తమ సీఎం చంద్రబాబు అడ్డుకున్నది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.