ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపూరి. ఒక వేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్‌గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు.