వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జె. మాణిక్యాల రావు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా కామెంట్స్ చేశారంటూ తెలిపారు. తక్షణమే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. ఆయనపై 17 కేసులు నమోదు చేశారు. వీటిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇంకో వైపు దర్శకుడు ఆర్జీవీకి గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.