శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు
NEWS Mar 06,2025 09:11 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 63 వేల 285 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 829 తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామలరావు. ప్రస్తుతం దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.