రాజారాంపల్లిలో బీజేపీ సంబరాలు
NEWS Mar 06,2025 08:06 am
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బిజెపి ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు, ప్రధాన కార్యదర్శి పి.నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు జి. గంగాచలం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు చేపట్టారు. బాణా సంచా పేల్చారు.