పాకిస్తాన్ లోని లాహర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాంండ్ 362 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకు పోరాడింది. డేవిడ్ మిలన్ చుక్కలు చూపించాడు కీవీస్ బౌలర్లకు. అయినా జట్టును గెలిపించ లేక పోయాడు. 312 పరుగులకే పరిమితమైంది. దీంతో న్యూజిలాండ్ 50 రన్స్ తో గెలుపొందింది. ఫైనల్ కు చేరింది. భారత జట్టు తో తలపడనుంది ట్రోఫీ కోసం.