పెరిగిన ధరలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు. సుప్రీంకోర్టు కనీస వేతన చట్టం అమలు చేయాలని స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు.. బుధవారం ZHB మహీంద్రా ట్రాక్టర్ పరిశ్రమలో సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. .తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం 26,000 పెంచాలని కోరారు. లేని పక్షంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.