మెదక్ జిల్లా రామాయంపేట శివారులో చిరుత పులిని బంధించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత పది రోజులుగా చిరుత పులి గ్రామ శివారులోని సర్వాయికుంట శివారులోని వ్యవసాయ పొలాల వద్ద సంచరిస్తూ పశువుల పాకపై దాడులు చేస్తుంది. దీంతో చిరుత పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోను ఏర్పాటు చేసి చిరుత పులికి ఎరవేసేందుకు కుక్కను ఏర్పాటు చేశారు. చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తే ఆనవాళ్లు తెలిసే విధంగా రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.