ఘణంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం
NEWS Mar 05,2025 04:21 pm
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనక దుర్గ అమ్మ వారి ఆలయం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ఫాల్గుణ శుక్ల పక్ష షష్టిని పురస్కరించుకుని బుధవారం మహా మండపం 7వ అంతస్తు లో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తముగా నిర్వహించారు. ఈ సేవలో భక్తులు విశేషముగా పాల్గొన్నారు. స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. కళ్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ, ఈవో సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.