జిల్లాకో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం
NEWS Mar 05,2025 04:05 pm
రాష్ట్రంలోని యూనివర్శిటీలకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రాజకీయాలకు కేరాఫ్ గా మార్చారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక ప్రతిభ, నిబద్దత కలిగిన వారిని వీసీలుగా నియమించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు యూనివర్శిటీ ప్రగతిపై ఫోకస్ పెట్టామన్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలో టాప్ -100లో ఏపీకి చెందిన యూనివర్శిటీలు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.