ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఇలా ప్రజలను నమ్మించాలని అనుకోవడం దారుణమన్నారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారంటూ మండిపడ్డారు. 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారని ఆవేదన చెందారు. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని ఫైర్ అయ్యారు.