రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు
NEWS Mar 05,2025 03:33 pm
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. డైరెక్టర్ తమ కులాన్ని, నాయకులను కావాలని కించ పరిచేలా తీశాడని ఆరోపించారు. ఇప్పటికే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలో పలు ఫిర్యాదులు అందాయి. విచారణకు రావాల్సిందిగా తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.