కాంగ్రెస్ పార్టీపై మధు యాష్కీ ఫైర్
NEWS Mar 05,2025 03:22 pm
మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై సీరియస్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పార్టీలో రెడ్లు, అగ్ర కులాలకు చెందిన వాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడని, మరి ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా నన్ను పిలవలేదంటూ మండిపడ్డారు.