సీఎం చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం గురించి ప్రస్తావించారు. తాను ఏనాడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించ లేదని చెప్పారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్లపై ఫిర్యాదు చేయడంపై స్పందించారు. చివరి ప్రాంతాలకు మిగులు జలాలను తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. పోలవరం సముద్రంలోకి పోయే నీటిని కరవు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వృధా నీటిని తీసుకు వెళితే కొందరు రాజకీయం చేయడం దారుణమన్నారు.