హైకోర్టులో పోసాని కృష్ణ మురళి పిటిషన్
NEWS Mar 05,2025 10:11 am
నటుడు పోసాని కృష్ణ మురళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తనపై 17 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన అన్ని కేసులను క్వాష్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా సీఎం చంద్రబాబు, భార్య భువనేశ్వరి, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను దారుణంగా కామెంట్స్స చేయడంతో తనపై కేసులు నమోదయ్యాయి.