హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది. మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరు కావాలని మాధవ్ కు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడకు వెళ్ల లేక పోయానని చెప్పారు మాజీ ఎంపీ. వీలైతే ఇవాళ లేదా రేపు హాజరవుతానని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారి పోవడం లేదన్నారు. తన కోసం వైసీపీ లీగల్ టీమ్ ఏర్పాటు చేసిందని, పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.