చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడి కటాక్షం
NEWS Mar 05,2025 08:51 am
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా బ్రహ్మోత్సాలు జరుగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ ఏఈవో రమేష్ పాల్గొన్నారు.