శ్రీవారి ఆలయ నిర్మాణాలకు స్థలాలు ఇవ్వండి
NEWS Mar 05,2025 08:42 am
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, సమాజ అభివృద్ధికి దోహద పడతాయని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలన్నది తమ సంకల్పమన్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల ద్వారా విద్య, వైద్యం, సేవా రంగాలకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.