ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యు ఒడిలోకి భర్త అక్కడికక్కడే మృతి చెందగా,భార్య అనసూర్య తీవ్ర గాయాల పాలవడంతో నిజామాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు. చిన్న కూతురు ఆస్ట్రేలియాలో ఉండడం వలన నర్సారెడ్డి అంత్య క్రియలు మంగళవారం చేద్దాం అనుకున్నారు. కానీ తీవ్ర గాయలతో చికిత్స తీసుకుంటున్న అనసూర్య కాస్త సోమవారం మృతి చెందింది. చిన్న కూతురు ఆస్ట్రేలియా నుండి ఊరిలోకి చేరుకోగా, పిడుగు లాంటి వార్త వారి చెవిలో పడింది . మీ అమ్మ చనిపోయింది డెడ్ బాడీ తీసుకొస్తున్నారని తెలుపగా ఆ ఇంటిలో రోదనలు మిన్నంటాయి.