ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించు కోవాలని లబ్ధిదారులకు సూచించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.