ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ధర్మాసనం సీరియస్
NEWS Mar 04,2025 04:56 pm
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ సందర్బంగా జస్టిస్ బీఆర్ గవాయితో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయి. నిర్ణయానికి ఎంత సమయం కావాలో చెప్పాలన్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేశారు.