సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి కోసం రోగులు అల్లాడుతున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ అలంకార ప్రాయంగా మిగిలి పోయింది. వాటర్ ఫిల్టర్ కు మంచినీటి సరఫరా నిలిపివేసి విద్యుత్ కనెక్షన్ ఆపేశారు. ఓవైపు మండుతున్న ఎండలకు రోగులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వాటర్ ఫిల్టర్ ను బాగు చేయాలని కోరుతున్నారు రోగులు.