ఎస్ఎల్బీసీ ప్రమాదం సర్కార్ వైఫల్యం
NEWS Mar 04,2025 02:59 pm
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జీఎస్ఐ అధికారుల అనుమతి, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఎలా పనులు మొదలు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మృత దేహాలను వెలికి తీయక పోవడం దారుణమన్నారు. నీళ్లు వస్తున్నాయని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పనులను నిలిపి వేసిందని, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారంటూ ఫైర్ అయ్యారు.