మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన మల్క కొమురయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో బిజెపి పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు ర్యాలీ నిర్వహించారు.