మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూనివర్శిటీల వీసీలను రాజీనామా చేయాలంటూ బెదిరించానని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైకాపా ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని లోకేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడును కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరింపు అన్న పదం లేనే లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదంటూ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ..రాజారెడ్డి చెల్లెలి కోడలు అని, మరో వీసీ ప్రసాదొడ్డి.. వైకాపా కార్యకర్త అని ఆరోపించారు.