మాజీ సెబీ చీఫ్ కు కోర్టు ఊరట
NEWS Mar 04,2025 01:34 pm
మాజీ సెబీ చీఫ్ మాధబీ పూరి బుచ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనతో పాటు సెబీ పూర్తికాల సభ్యులపై , బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన ప్రత్యేక కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపి వేసింది. ఇదిలా ఉండగా 1994లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సెబీ చీఫ్, ఇతర బిఎస్ఇ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది.