ఎమ్మెల్సీ కోదండరాంకు బిగ్ షాక్ తగిలింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపర్చిన అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడు ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం నియోజకవర్గానికి ఒక్క ఓటు చొప్పున కూడా పడక పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణవాదులు. దీనిపై పునః సమీక్షించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.