ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన 5 స్థానాలలో ఒకటి జనసేన పార్టీకి చెందిన నాగబాబు కొణిదెలకు కేటాయించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే నాగ బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇందులో భాగంగా తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో నాగ బాబుకు లైన్ క్లియర్ అయ్యింది.