అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తమ పార్టీ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 13,969 ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డి.. 19వ రౌండ్ లో తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పై గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది.